హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉచిత కోచింగ్‌కు 17న స్క్రీనింగ్ టెస్ట్: జిల్లా పోలీసులు

SRD: ఎస్ఐ పీసీ అభ్యర్థులకు ఉచిత కోచింగ్ అందించేందుకు అక్టోబర్ 17న ఉదయం 10 గంటలకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించనున్నట్లు సంగారెడ్డి జిల్లా పోలీసులు తెలిపారు. ఇందుకోసం సంగారెడ్డి, జహీరాబాద్, జోగిపేటలలో 3 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. అభ్యర్థులు తమ ఆధార్ కార్డు, కానిస్టేబుల్ ప్రిలిమినరీ అఫీషియల్ కాపీతో కేంద్రాలకు హాజరుకావాలని పోలీసు అధికారులు సూచించారు.