హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లారీ ఢీకొని తల్లీ కొడుకు మృతి..!

WG: తాడేపల్లిగూడెం మండలం నీలాద్రిపురంలో విషాదం చోటుచేసుకుంది. నిడదవోలు మండలం కంసాలిపాలెం- రావిమెట్ల మధ్య లారీ, బైకును ఢీకొన్న ప్రమాదంలో తల్లీకుమారుడు మృతి చెందారు. ఈ ప్రమాదంలో పాకలపాటి లక్ష్మి(40), ఆమె కుమారుడు చంద్రశేఖర్ (23) మృతిచెందారు. రాజమండ్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బంధువులకు భోజనం తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.