హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

MDCL: చెట్ల కొమ్మల తొలగింపు, ఇతర మరమ్మతు పనుల కారణంగా మల్కాజ్‌గిరిలో ఇవాళ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనున్నట్లు ఏడీఈ రాజశేఖర్ తెలిపారు. మల్లికార్జునగర్, గౌతమనగర్, గోపాల్‌నగర్ ప్రాంతాల్లో పవర్ కట్ ఉండనుందని, ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.