ADB: నేరేడిగొండలో జాతీయ రహదారి 44కు ఇరువైపులా చేపట్టాల్సిన సర్వీస్ రోడ్డు నిర్మాణ పనులను ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్, ఎన్‌హెచ్ డిప్యూటీ జీఎం శైలజతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా నూతన పనులపై పలు సూచనలు చేసి, తక్షణమే పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ గంగాధర్ రావు, సహకార సంఘం చైర్మన్ ప్రశాంత్ తదితరులు ఉన్నారు.
తెలంగాణ
సర్వీస్ రోడ్డు పనులను పరిశీలించిన ఎంపీ నగేశ్


