హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

KNR: కరీంనగర్ నగరంలోని సర్కస్ గ్రౌండ్, పద్మనాయక కల్యాణ మండపం, గీతా భవన్ వెనుక ప్రాంతాల్లో శుక్రవారం విద్యుత్తు సరఫరా నిలిపివేయనున్నట్లు నగర రెండో ఏడీఈ ఎం. లావణ్య తెలిపారు. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ కోత ఉంటుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.