హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాలల రక్షణకు ప్రత్యేక వాహనం

PLD: రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు పి. పద్మలత ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడను కలిసి వినతిపత్రం అందజేశారు. బాలల హక్కుల పరిరక్షణ, సంక్షేమంపై పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఆపదలో ఉన్న చిన్నారులను సకాలంలో రక్షించేందుకు ప్రత్యేక వాహనం అవసరమని వివరించారు. ఎమ్మెల్యే రెస్క్యూ సేవల కోసం వెంటనే వాహనం ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చారు.