హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఏడేళ్ల తర్వాత కుటుంబ సభ్యుల చెంతకు మహేందర్‌

KNR: వీణవంక మండలం ఘన్ముక్ల గ్రామానికి చెందిన బొంగోని మహేందర్‌ ఏడేళ్ల క్రితం గ్రామం నుంచి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. ఓ ఫౌండేషన్‌ సహకారంతో గురువారం మహేందర్‌ తిరిగి ఇంటికి చేరుకున్నాడు. ఏళ్లుగా దూరమైన వ్యక్తిని కుటుంబ సభ్యుల చెంతకు చేర్చిన ఫౌండేషన్‌ ప్రతినిధులను గ్రామస్థులు సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.