PDPL: ధర్మారం మండలం చామనపల్లి గ్రామ పునరావాసం కోసం భూసేకరణ చేపట్టేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. గురువారం భూసేకరణ, పునరావాస కమిషనర్ శివకుమార్ నాయుడు, ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్ శ్రీనివాసరావు గుప్తతో కలిసి గ్రామస్థులతో సమావేశమయ్యారు. భారీ వర్షాలు, వరదలతో గ్రామం ముంపునకు గురవుతున్న నేపథ్యంలో వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.
తెలంగాణ
చామనపల్లి గ్రామ పునరావాసంపై కలెక్టర్ సమీక్ష


