హైదరాబాద్: 28°C
తెలంగాణ

నాలుగు ఆలయాల బాధ్యతలు స్వీకరించిన కొండారెడ్డి

SRPT: చింతలపాలెం మండల పరిధిలోని రేబల్లె, చింత్రియాల, వెల్లటూరు, అడ్లూరు గ్రామాల ఆలయాలకు అదనపు ఈఓగా కూన్రెడ్డి కొండారెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆయన వెల్లటూరు శ్రీ పాపనాశేశ్వర స్వామి దేవస్థానం ఈఓగా విధులు నిర్వహిస్తుండగా, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ అదనపు బాధ్యతలను చేపట్టారు. ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.