KDP: ఖాజీపేట మండలం నాగసానిపల్లి సమీపంలోని లంకమల్ల అభయారణ్య ప్రాంతంలో అక్రమంగా తరలిస్తున్న 7 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు ప్రొద్దుటూరు అటవీ క్షేత్ర అధికారి హేమాంజలి గురువారం తెలిపారు. వీటి బరువు 234 కిలోలు ఉన్నట్లు పేర్కొన్నారు. అటవీ సిబ్బందిని చూసి స్మగ్లర్లు పరారయ్యారని, వారిని పట్టుకునేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం స్వాధీనం


