హైదరాబాద్: 28°C
తెలంగాణ

'స్వచ్ఛమైన నీరు శరీర పెరుగుదలకు తోడ్పడుతుంది'

PDPL: స్వచ్ఛమైన తాగునీరు విద్యార్థుల ఆరోగ్యానికి, శారీరక ఎదుగుదలకు ఎంతో అవసరమని ఉమెన్ డెవలప్‌మెంట్ వెల్ఫేర్ సొసైటీ కార్యదర్శి జమునారాణి తెలిపారు. పత్తిపాక పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆర్‌ఓ వాటర్ ప్లాంట్‌ను ఆమె ప్రారంభించారు. ఈ ప్లాంట్ ద్వారా ప్రాథమిక, ఉన్నత పాఠశాలలతో పాటు అంగన్‌వాడీ కేంద్రాలకు చెందిన 300 మంది విద్యార్థులకు శుద్ధమైన తాగునీరు అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు.