హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెట్టును ఢీకొన్న ఐచర్.. డ్రైవర్ మృతి

NRML: భైంసా నుంచి సర్దార్‌పూర్ పశువుల మార్కెట్‌కు ఎడ్లను తరలిస్తున్న ఐచర్ వాహనం గురువారం నవీపేట్‌లోని పాలకేంద్రం సమీపంలో చెట్టును ఢీకొట్టింది. నవీపేట్ ఏఎస్సై వెంకటేశ్వర్లు తెలిపిన ప్రకారం.. భైంసాకు చెందిన డ్రైవర్ సౌదీ అన్సారీ(53) నిద్రమత్తులో చెట్టును ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. క్లీనర్ జయీద్, హకీంలకు స్వల్ప గాయాలయ్యాయి.