హైదరాబాద్: 28°C
తెలంగాణ

వైభవంగా దుర్గామాత ఆగమన్ ఉత్సవం

SRCL: వేములవాడలో గురువారం దుర్గామాత ఆగమన్ ఉత్సవాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, నాయకులు ప్రతాప రామకృష్ణ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పుల్కం రాజు మాట్లాడుతూ.. దుర్గామాత ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. నవరాత్రి ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు.