హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మహిళలకు ఒకే వేదికపై సమగ్ర సేవలు

ASR: మహిళల రక్షణ, భద్రతకు ఒకే వేదికపై సమగ్ర సేవలు అందించేందుకు మిషన్‌ శక్తి-వన్‌స్టాప్‌ సెంటర్‌ నూతన భవనం అందుబాటులోకి వచ్చింది. నిన్న పాడేరులో అధికారులు భవనాన్ని ప్రారంభించారు. హింస, వేధింపులు, ఆపదల్లో ఉన్న మహిళలకు పోలీసు, వైద్య, ఉచిత న్యాయసహాయం, కౌన్సెలింగ్‌, ఆశ్రయం సేవలు అందిస్తామని సిబ్బంది తెలిపారు. మారుమూల ప్రాంతాల మహిళలకు సేవలు అందిస్తామన్నారు.