హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: జిల్లాలో వైసీపీ విస్తృత సమావేశం

NTR: ఈనెల 12న నున్నలోని స్వప్న ఫంక్షన్ హాల్‌లో విజయవాడ రూరల్ మండల వైఎస్సార్‌సీపీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు మండల పార్టీ అధ్యక్షుడు అంగజాల హనుమ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై చర్చించడంతో పాటు పార్టీ పదవుల్లో నియమితులైన వారికి ఐడీ కార్డులు పంపిణీ చేస్తామన్నారు. కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ హాజరవుతారన్నారు.