హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

SKLM: సంతబొమ్మాళి మండలం కోటపాడుకు చెందిన కొయ్యల సంజీవరావు అలియాస్ చంటి (29) చికిత్స పొందుతూ గత రాత్రి మృతి చెందాడు. గత నెల 30న టెక్కలి నుంచి కోటపాడుకు బైక్‌పై వెళ్తుండగా తాళ్లవలస సమీపంలో ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీకొట్టింది. గాయపడిన సంజీవరావును ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.