NZB: నిజామాబాద్ కసాబ్ గల్లీలో మట్కా ఆడుతున్నారనే సమాచారంతో గురువారం పోలీసులు తనిఖీలు నిర్వహించినట్లు 2వ టౌన్ SI యాదగిరి తెలిపారు. అక్కడ కళ్యాణ్ కార్, శంకర్ అనే వ్యక్తి ఫోన్లలో మట్కా ఆడుతూ పట్టుబడ్డాడు. అతని నుంచి 2 ఫోన్లు, రూ.2,450 నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నిందితుడిని పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు.
తెలంగాణ
కసాబ్ గల్లీలో మట్కా.. ఒకరి అరెస్ట్


