BHPL: మొగుళ్లపల్లిలో ‘ఇడుపు కాగితం’ సినిమా షూటింగ్ సందడి నెలకొంది. ఈ చిత్రంలో నటుడు ప్రియదర్శి, ఫోక్ డాన్సర్ నాగదుర్గ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. గ్రామంలోని పలు ప్రాంతాల్లో చిత్రీకరణ కొనసాగుతోంది. సినిమా షూటింగ్ కోసం చిత్ర యూనిట్ గ్రామానికి చేరుకోవడంతో స్థానికుల్లో ఆసక్తి నెలకొంది. తమ ప్రాంతంలో సినిమా షూటింగ్ జరుగుతుండటంతో గ్రామస్తులు, పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
తెలంగాణ
మొగుళ్లపల్లిలో 'ఇడుపు కాగితం' షూటింగ్


