NGKL: కొల్లాపూర్ మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్ బాలికల పాఠశాలను అధికారులు ఆకస్మికంగా సందర్శించారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన కార్యక్రమంలో భాగంగా 9వ తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న పరీక్షలను వారు పరిశీలించారు. పరీక్షల నిర్వహణ తీరును, విద్యార్థుల హాజరును పరిశీలించిన అనంతరం పాఠశాలలోని రికార్డులను తనిఖీ చేశారు.
తెలంగాణ
పరీక్షల నిర్వహణపై అధికారుల ఆకస్మిక తనిఖీ


