హైదరాబాద్: 28°C
తెలంగాణ

నాగోల్‌ మహిళ హత్య కేసులో ఇద్దరి అరెస్ట్‌

HYD: నాగోల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేశారు. మణికేశ్వర్‌ నగర్‌కు చెందిన మంగమ్మతో కలిసి మద్యం తాగిన ఇద్దరు నిందితులు రూ.5 వేల కోసం ఆమెతో ఘర్షణకు దిగినట్లు పోలీసులు తెలిపారు. మద్యం మత్తులో ఉన్న మంగమ్మ గొంతు నులిమి హత్య చేసినట్లు వెల్లడించారు.