హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైభవంగా ప్రదోష కాల వృషభార్చన కార్యక్రమం

NLR: బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం లో అధికార రాతి నందీశ్వరునికి ప్రదోష కాల వృషభార్చన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ప్రదోష కాలం సందర్భంగా ఆలయ అర్చకులు వేదపండితులు నందీశ్వరునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొంది తీర్థ ప్రసాదాలు అందుకున్నారు.