హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓపెన్ స్కూల్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

MHBD: ఈ నెల 11 నుంచి 17 వరకు నిర్వహించనున్న TOSS పదో తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ కె. అనిల్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. పరీక్షా కేంద్రాల్లో 144 సెక్షన్ అమలు, పోలీస్ బందోబస్తు,ఆర్టీసీ బస్సుల ఏర్పాట్లు చేయాలని సూచించారు.