హైదరాబాద్: 28°C
తెలంగాణ

కళాశాల వసతిగృహంలో కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ

KNR: కార్ఖానాగడ్డ ఎస్సీ బాలుర కళాశాల వసతిగృహాన్ని కలెక్టర్‌ చిత్రా మిశ్రా గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటగదిలోకి వెళ్లి భోజన తయారీని పరిశీలించి, గరిటెతో కూరను కలియబెట్టారు. విద్యార్థులతో మాట్లాడి భోజనం, తాగునీరు, వసతులపై ఆరా తీశారు. నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని, పరిశుభ్రత పాటించాలని ఆదేశించారు. హాస్టల్‌ భవనానికి వెంటనే మరమ్మతులు చేయాలన్నారు.