హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మదనపల్లెలో ‘డ్రగ్స్ వద్దు బ్రో’ అవగాహన సదస్సు

అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు డిగ్రీ కళాశాలలో ‘డ్రగ్స్ వద్దు బ్రో’ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డ్రగ్స్‌ వల్ల కలిగే అనర్థాలను విద్యార్థులకు వివరించి, మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. డ్రగ్స్‌ సమాచారం ఉంటే 1972, 112 లేదా వాట్సాప్ 8688830014కు తెలియజేయాలని పోలీసులు కోరారు.