హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హత్యాయత్నం కేసులో నిందితుడికి ఐదేళ్ల జైలు

అన్నమయ్య: చౌడేపల్లి మండలం కొలింపల్లెలో దారి, ఇంటి స్థలం వివాదంతో యనమల సావిత్రమ్మపైకి ట్రాక్టర్ ఎక్కించి హత్యాయత్నానికి పాల్పడిన పాశం నాగరాజుకు మదనపల్లె 7వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు 5 ఏళ్ల జైలు, రూ.20 వేల జరిమానా విధించింది. పక్కా ఆధారాలతో నేరం రుజువు కావడంతో తీర్పు వెలువడింది. కేసును సమర్థవంతంగా దర్యాప్తు చేసిన పోలీసులకు ఎస్పీ అభినందించారు.