KMR: రామారెడ్డి మండలంలోని పలు తండాల్లో ఎక్సైజ్ సిబ్బంది గురువారం నాటుసారా తయారీపై దాడులు నిర్వహించారు. కన్నైగూడెం తండా శివారులో అక్రమంగా నిల్వ చేసిన 40 లీటర్ల ఎఫ్‌జే వాష్‌ను గుర్తించి ధ్వంసం చేశారు. ఘటనపై రెండు కేసులు నమోదు చేశారు. పలు కల్లు దుకాణాలను తనిఖీ చేసి నాణ్యత పరీక్షల కోసం నమూనాలు సేకరించారు. అక్రమ మద్యం కార్యకలాపాలపై నిఘా కొనసాగుతుందని తెలిపారు.
తెలంగాణ
నాటుసారా తయారీపై ఎక్సైజ్ సిబ్బంది దాడులు


