హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెన్నారంలో రీ-సర్వే పనుల పరిశీలన

WGL: వర్ధన్నపేట మండలం చెన్నారం గ్రామంలో జరుగుతున్న భూ రీ-సర్వే పనులను వరంగల్ ఆర్డీవో సుమ గురువారం పరిశీలించారు. సర్వే పురోగతిని అధికారులను అడిగి తెలుసుకుని, మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలని సూచించారు. భూ వివరాల నమోదులో పొరపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామ ప్రజల సందేహాలను ఆమె నివృత్తి చేశారు.