హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రామాలయ నిర్మాణాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

WG: ఆకివీడు పెదపేటలోని రామాలయ నిర్మాణాన్ని గురువారం ఉండి ఎమ్మెల్యే రఘురామరాజు పరిశీలించారు. ఆలయ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఆలయ ప్రాంగణంలో ప్రతిష్టించేందుకు కుక్కునూరు ప్రాంతం నుంచి తీసుకువచ్చిన ధ్వజస్తంభాన్ని ఆయన పరిశీలించారు. ఆలయ నిర్మాణ పనులు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట మోటుపల్లి ప్రసాద్, గంధం ఉమ, తదితరులు పాల్గొన్నారు.