హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓవర్‌లోడ్‌ ఇసుక టిప్పర్లకు జరిమానా

NRPT: మాగనూరు మండలంలో పరిమితికి మించి ఇసుక తరలిస్తున్న రెండు టిప్పర్లకు అధికారులు జరిమానా విధించారు. ఆన్‌లైన్‌ అనుమతుల పేరుతో ఓవర్‌లోడ్‌ రవాణా చేస్తున్నారన్న సమాచారంతో AMVI గౌతమ్‌రాజ్‌ తనిఖీలు చేపట్టారు. సామర్థ్యానికి మించి లోడ్‌తో పట్టుబడిన రెండు టిప్పర్లపై జరిమానా విధించినట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.