SRCL: ఎల్లారెడ్డిపేట మండలకేంద్రంలో మహిళపై కులం పేరుతో దూషించి ప్రహరీ గోడ ధ్వంసం చేసిన కేసులో డీఎస్పీ కె.నాగేంద్రచారి గురువారం విచారణ చేపట్టారు. కొప్పెల్లి సత్తవ్వ ఫిర్యాదుతో కేసు నమోదైంది. సంఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితురాలు, సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేశారు. ఆధారాలు సేకరించామని, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తెలంగాణ
కుల దూషణపై డీఎస్పీ విచారణ


