హైదరాబాద్: 28°C
వార్తలు

ఈనెల 17న క్విజ్ పోటీలు

SKLM: సోంపేట మండలం లక్కవరం గ్రామంలో శ్రీ సరస్వతి దేవి నవరాత్రుల ఐదవ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 17న ఉత్తరాంధ్ర స్థాయి ఓపెన్ క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు కమిటీ గురువారం తెలిపింది. ప్రతి గ్రూపులో ఐదుగురు సభ్యులు ఉండాలని, ప్రవేశ రుసుము, వయో పరిమితి లేదని, భోజన సదుపాయం కల్పిస్తామని పేర్కొన్నారు. 15వ తేదీలోగా నమోదు చేసుకోవాలని కోరారు.