హైదరాబాద్: 28°C
తెలంగాణ

బతుకమ్మ ఘాట్ వద్ద ఏర్పాట్లు

PDPL: రాబోయే బతుకమ్మ పండుగ పర్వదినం సందర్భంగా లింగాపూర్ శివారు బతుకమ్మ ఘాట్ వద్ద ఏర్పాట్లు చేపట్టారు. రామగుండం కార్పొరేషన్ 29వ డివిజన్ కార్పొరేటర్ రజని ఆధ్వర్యంలో గురువారం బతుకమ్మ నిమజ్జన ఘాట్ ప్రదేశాన్ని ప్రొక్లెయిన్ సహయంతో చదును చేశారు. సద్దుల బతుకమ్మ రోజు మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.