హైదరాబాద్: 28°C
తెలంగాణ

జగిత్యాల మెడికల్ కాలేజీ విద్యార్థుల సమ్మె విరమణ

జగిత్యాల మెడికల్ కాలేజీ విద్యార్థులు, వైద్యులు సమ్మె విరమించారు. మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, డీఎంఈ అధికారులతో జరిపిన చర్చలు సానుకూలంగా సాగాయి. డిసెంబర్ 15 నాటికి కాలేజీ భవనం, హాస్టల్, మెస్, ప్లేగ్రౌండ్ తదితర మౌలిక వసతుల పనులు పూర్తి చేస్తామని కలెక్టర్ బి.సత్యప్రసాద్ హామీ ఇచ్చారు. రేపటి నుంచి తరగతులు, విధులు యథావిధిగా కొనసాగనున్నాయి.