NRPT: మాగనూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒల్లాపూర్ గేట్ సమీపంలో ఎలాంటి పర్మిట్లు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న టిప్పర్‌ను పోలీసులు పట్టుకున్నారు. వల్లంపల్లికి చెందిన డ్రైవర్ నరసప్పను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఎస్సై అశోక్ బాబు తెలిపారు. అక్రమ ఇసుక రవాణాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
తెలంగాణ
అక్రమంగా ఇసుకను తరలిస్తున్న టిప్పర్ స్వాధీనం


