హైదరాబాద్: 28°C
తెలంగాణ

ద్విచక్ర వాహనం ఢీకొని మహిళ మృతి

NZB: ఎడపల్లి మండల కేంద్రంలో NH-63పై రోడ్డు దాటుతున్న ఏషాలా కళావతిని నిజామాబాద్ నుంచి బోధన్ వెళ్తున్న గోవింద్ సింగ్ బైక్‌తో  బలంగా ఢీకొట్టాడు. తీవ్ర రక్తస్రావమైన ఆమెను స్థానికులు నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తలకు తగిలిన బలమైన గాయంతో చికిత్స పొందుతూ ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.