KDP: సీకే దిన్నె మండలం కొత్తపేటలోని శ్రీ గంగమ్మ దేవత దేవస్థాన శాశ్వత హుండీలను దేవాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో తెరిచి లెక్కించారు. కడప డివిజన్ ఇన్‌స్పెక్టర్ శివయ్య సమక్షంలో ఈవో మూడే కృష్ణా నాయక్, ఛైర్మన్ సోమల మాధవరెడ్డి పర్యవేక్షణలో లెక్కింపు జరిగింది. హుండీల ద్వారా రూ.7,43,761 ఆదాయం వచ్చినట్లు ఈవో తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
గంగమ్మ దేవత ఆలయ ఆదాయం ఎంతంటే..?


