ప్రకాశం: అర్ధవీడు మండలం మావుటూరు గ్రామంలో రిటైర్డ్ ఉద్యోగి ఆవులయ్య ఇంట్లో గురువారం చోరీ జరిగింది. ఇంటి యజమాని పొలానికి వెళ్లిన సమయంలో దుండగులు ఇంట్లోకి ప్రవేశించి బీరువాలోని 12 తులాల బంగారం, లక్ష రూపాయల నగదును అపహరించారు. పొలం నుంచి ఇంటికి తిరిగి వచ్చిన ఇంటి యజమాని ఆవులయ్య చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
ఆంధ్రప్రదేశ్
రిటైర్డ్ ఉద్యోగి ఇంట్లో చోరీకి పాల్పడిన దుండగులు


