SRD: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి TPTF నిరంతరం కృషి చేస్తుందని మండల అధ్యక్షుడు ఎం.ఏ. రహీమ్, జిల్లా కౌన్సిలర్ వెంకట్ అన్నారు. వాసర్ MPPSలో గురువారం నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఉపాధ్యాయులకు సభ్యత్వ కార్డులను అందజేశారు. విద్యావ్యవస్థ బలోపేతానికి ప్రతి ఒక్కరూ సంఘంలో భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో హెచ్‌ఎం సంగ్రామ్ పాల్గొన్నారు.
తెలంగాణ
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి: TPTF


