హైదరాబాద్: 28°C
తెలంగాణ

పీయూలో రేపు యువ ర్యాలీ

MBNR: నషా ముక్త్‌ భారత్‌ అభియాన్‌లో భాగంగా పీయూ NSS సెల్‌ ఆధ్వర్యంలో రేపు యువ ర్యాలీ, జిల్లా స్థాయి సాంస్కృతిక పోటీలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు పీయూ ప్రధాన ద్వారం నుంచి బండమీదిపల్లి చౌరస్తా వరకు యువ ర్యాలీ జరగనుంది. అనంతరం స్కిట్స్‌, పాటలు, నృత్య పోటీలు నిర్వహించనున్నట్లు ఎన్‌ఎస్‌ఎస్‌ సమన్వయకర్త డా. కె. ప్రవీణ్‌ తెలిపారు.