హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇసుక లారీల వేగానికి బ్రేక్.. ఎస్పీ ఆదేశాలు

MLG: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ కేకన్ సుధీర్ రామ్‌నాథ్ ఐపీఎస్ ఆదేశించారు. గురువారం నెలవారీ నేర సమీక్షలో పెండింగ్ కేసులు గడువులోగా పూర్తి చేయాలని, ఈ-సాక్ష్య అప్డేట్, వేగంగా ఛార్జ్‌షీట్లు, 24/7 డ్రంక్‌అండ్‌డ్రైవ్ తనిఖీలు చేపట్టాలని సూచించారు. ఇసుక లారీల వేగాన్ని నియంత్రించి, స్పీడ్ లిమిట్ దాటితే సీజ్ చేయాలన్నారు.