VZM: శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవంలో భాగంగా సిరిమాను చెట్టు తరలింపుపై ఎమ్మెల్యే అదితి గజపతిరాజు గురువారం ఆమె క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చేపట్టాల్సిన భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. ఇందులో పట్టణ, మండల తహసీల్దార్లు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
సిరిమాను చెట్టు తరలింపుపై సమీక్ష


