హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెద్దకూడాలలో సబ్సిడీ శనగ విత్తనాల పంపిణీ

KDP: లింగాల మండలంలోని పెద్దకూడాల రైతు సేవా కేంద్రంలో శెనగ విత్తనాలకు నమోదు చేసుకున్న రైతులకు గురువారం ఏవో రమేశ్ సబ్సిడీ శనగ విత్తనాలను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ..1250 క్వింటాళ్ల శనగ విత్తనాలు మంజూరయ్యాయని తెలిపారు. పెద్దకూడాల, బోనాల, కామసముద్రం,వెలిదండ్ల గ్రామాల్లో ఇప్పటి వరకు 439.8 క్వింటాళ్ల శనగ విత్తనాలను రైతులకు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.