సత్యసాయి: పుట్టపర్తి నియోజకవర్గంలో అక్టోబర్ 9న ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పర్యటించనున్నారు. ఓడిచెరువు, నల్లమాడ, పుట్టపర్తిలలో రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేయనున్నారు. అనంతరం బుక్కపట్నంలో చుక్కల భూములు, 22ఏ జాబితా నుంచి తొలగించిన హక్కు పత్రాలను అందజేస్తారని టీడీపీ నేతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రేపు పుట్టపర్తిలో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పర్యటన


