హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అనధికార లేఅవుట్లు, నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలి'

సత్యసాయి: జిల్లా పరిధిలో అనుమతులు లేని అనధికార లేఅవుట్లు, భవన నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని పుడా వైస్ చైర్మన్, జేసీ మౌర్య భరద్వాజ్ ఆదేశించారు. కదిరి డివిజన్ అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనుమతులు లేకుండా లేఅవుట్లు వేసే వారిపై నిఘా ఉంచాలని, నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.