కర్నూలు జిల్లాలో 2026-27కి రెన్యూవల్ కాని 17 మద్యం షాపులకు దరఖాస్తులు ఆహ్వానించారు. వాటిలో 15 షాపులకు నాలుగు లేదా అంతకంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో 62 మంది దరఖాస్తుదారులు, మీడియా సమక్షంలో లక్కీ డ్రా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డ్రా నిర్వహించినట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి సుధీర్‌బాబు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో 15 మద్యం షాపులకు లక్కీ డ్రా


