BPT: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో కలెక్టరేట్ సిబ్బంది కీలక బాధ్యత నిర్వర్తించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ముందస్తు ప్రణాళికలతో చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. మానవ వనరులు, వెబ్ కాస్టింగ్ పర్యవేక్షణకు నోడల్ అధికారులను నియమించామన్నారు.
ఆంధ్రప్రదేశ్
స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి: కలెక్టర్


