హైదరాబాద్: 28°C
తెలంగాణ

రుణ లక్ష్యాలను సాధించాలి: కలెక్టర్

NGKL: జిల్లా అభివృద్ధిలో బ్యాంకులు కీలక పాత్ర పోషించాలని కలెక్టర్‌ హేమంత్ కేశవ్ పాటిల్‌ సూచించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన డీసీసీ బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదలు, మహిళలు, రైతులు, నిరుద్యోగ యువత, ఔత్సాహికులకు విస్తృతంగా రుణాలు అందించాలని ఆదేశించారు. విద్యా, వ్యవసాయ, MSME, పీఎం సూర్యఘర్‌ తదితర రుణాల మంజూరుకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.