హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ట్రాఫిక్ సమస్యలకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలి'

PDPL: పెద్దపల్లి పట్టణంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ శ్రీ హర్ష అధికారులను ఆదేశించారు. గురువారం డీసీపీ రామ్ రెడ్డితో కలిసి కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. బిజీగా ఉండే ప్రదేశాలలో వన్‌వే, టూవే అమలును పరీక్షించాలని తెలిపారు. పశువులు రోడ్లపైకి రాకుండా యజమానులకు అవగాహన కల్పించాలని సూచించారు.