హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మహిళలకు సురక్షిత పని వాతావరణం కల్పించాలి'

PDPL: రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌లో మహిళలకు సురక్షిత, గౌరవప్రదమైన పని వాతావరణం కల్పించడంపై గురువారం సీపీ అంబర్‌ కిషోర్‌ ఝా అధ్యక్షతన అంతర్గత ఫిర్యాదుల కమిటీ సమావేశం జరిగింది. కార్యాలయాల్లో లైంగిక వేధింపుల నివారణకు POSH చట్టం-2013ను సమర్థవంతంగా అమలు చేయాలని CP సూచించారు. ఫిర్యాదులను నిబంధనల ప్రకారం విచారించి, నిర్ణీత గడువులో నివేదికలు సమర్పించాలన్నారు.