హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రైవేటు బస్సుల యజమానులకు డీటీవో హెచ్చరికలు

కోనసీమ: దసరా నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్నందున ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులలో టికెట్ ధరలు పెంచితే కఠిన చర్యలు తప్పవని జిల్లా రవాణా అధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు హెచ్చరించారు. గురువారం అమలాపురంలో ఆయన కార్యాలయంలో ప్రైవేటు బస్సుల యజమానులతో సమావేశం నిర్వహించారు. పండుగ సాకుతో అధిక చార్జీలు వసూలు చేస్తే కేసులు నమోదు చేస్తామని తెలిపారు.